కరోనా భయం ప్రజలను మాస్కు ధరించేటట్లు చేస్తోంది. అసలే సెకండ్ వేవ్, థార్డ్ వేవ్ కారణంగా ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. బయటకు వస్తే మాస్క్ తప్పనిసరి చేశాయి. అంతే కాదు ప్రజలు కూడా మాస్క్ ధరించడానికి అలవాటు పడ్డారు. ఎవరైన మాస్క్ ధరించకుంటే వారి నుంచి దూరంగా జరగడం ఇప్పుడు మనం చూస్తున్నాము. అంతలా కరోనా ప్రజలను ప్రభావితం చేస్తోంది. అయితే మస్క్ ధరించని వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో జరిమానాతో సరిపెడుతున్నాయి ప్రభుత్వాలు..కాని మరికొన్ని దేశాల్లో మాస్క్ ధరించకపోతే తీసుకెళ్లి జైళ్లో వేస్తున్నారు. సింగపూర్ లో ఓ వ్యక్తి మాస్క్ ధరించకపోవడమే కాదు ఏకంగా పోలీసులపైనే దగ్గాడు. ఇంకెముంది వెళ్లి వెళ్లి పోలీసుల పైనే దగ్గడంతో వారు వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
సింగపూర్ లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. దేవరాజ్ తమిళ్ సెల్వన్ అనే వ్యక్తి తన లవర్ ఇంటికెళ్లి గొడివ చేశాడు. దీంతో అమే పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దేవరాజ్ ను అక్కడి నుంచి తరలించారు. అక్కడి నుంచి అతన్ని హస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆవేశంలో దేవరాజ్ మాస్క్ తీసేశాడు. వెంటనే పక్కనే ఉన్న పోలీస్ అధికారి ముఖంపై దగ్గాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతన్ని తీసుకెళ్లి జైళ్లో వేశారు. గొడవ కేసుతో పాటుగా, మాస్క్ ధరించనందుకు, పోలీసుల మోహంపై దగ్గినందుకు మరో రెండు కేసులని కలిపి మొత్తం 14 జైళ్లో ఉండాలని న్యాయమూర్తి తీర్పు నిచ్చారు. దీంతో దగ్గితే ఇంత జరుగుతుందా అని అందరూ అనుకుంటున్నారు. మీరైతే మాస్క్ ధరించడం మరచిపోకండి.