మేఘాలయలో టీఎంసీకి ఓటేస్తే బిజెపిని ఢిల్లీ నుంచి తరిమికొడతామని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మేఘాలయలో టీఎంసీకి ఓటేస్తే బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొడతామన్నారు. బయటి నుంచి వచ్చి సీఏఏ, ఎన్ఆర్సీలను ఇక్కడి ప్రజలపై రుద్దుతున్నారన్నారు. కాన్రాడ్ సంగ్మా ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఏ పనిచేయలేదని విమర్శించారు. మేఘాలయ అభివృద్ధి, ప్రజల కోసం టీఎంసీ మాత్రమే పనిచేయగలదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. సంగ్మా ప్రభుత్వం ఇక్కడ వైద్య కళాశాలను కూడా నిర్మించలేదని విమర్శించారు. మంచి ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. టీఎంసీకి ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని మమతా బెనర్జీ తెలిపారు. మేఘాలయలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా, మార్చి 2న ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు రోజుకో రకంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement