Tuesday, November 19, 2024

రేవంత్ రాకతో కొత్త ఉత్సహం.. సీనియర్ల తీరుపై మల్లు రవి ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచి జోష్ లో ఉన్నారని, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో కార్యకర్తలు హార్డ్ వర్క్ చేస్తున్నారని టీ.పీసీపీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. డిజిటల్ మెంబెర్షిప్ 40 లక్షలు దాటిందని, గతంలో పేపర్ మెంబెర్ షప్ 17 లక్షలు కూడా కాలేదని తెలిపారు. కార్యకర్తలకు 2 లక్షల ప్రమాద భీమా పెట్టామన్న ఆయన.. గతంలో ఎన్నడూ ఇలాంటి పనులు జరగలేదన్నారు. కాంగ్రెస్ సమావేశాలు పెడితే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు లక్షలాదిగా తరలివస్తున్నారని చెప్పారు. టిఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు.

తెలంగాణలో జనం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మల్లు రవి అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు అయ్యాక కార్యకర్తలలో ఉత్సహం పెరిగిందని చెప్పారు. పార్టీని అధికారంలోకి తేవడానికి చాలా కష్టపడుతున్నారని తెలిపారు. దళిత దండోరా, జంగ్ సైరన్, వరి దీక్షలు, రైతులతో భేటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు,  మన ఊరు, మన పోరు, డిజిటల్ మెంబెర్షిప్ కార్యక్రమాలు పెద్దఎత్తున విజయవంతం అయ్యాయని తెలిపారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో సీనియర్లు పార్టీ శ్రేయస్సు కోసం ఆలోచించాలని కోరారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని చెప్పారు.

ప్రతి వారం పీఏసీ సమావేశం ఉంటుందని, ఆ సమావేశాలలో ఏమైనా చర్చించవచ్చు అని అన్నారు. కానీ బయట వ్యక్తి గత సమావేశాలు పెట్టి మాట్లాడడం పార్టీ  క్రమశిక్షణకు వ్యతిరేకం కాదా ? అని ప్రశ్నించారు. పార్టీ నష్టపోయేలా సీనియర్ల ప్రవర్తన ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్లు కార్యకర్తల శ్రేయస్సును ఆలోచించాలని హితవు పలికారు. పార్టీలో అన్ని అనుభవించిన వారు అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగాలని, పార్టీకి నష్టం చేసే వాళ్ళు ఎంతటివారు అయిన కూడా చార్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీకి తిరిగి అధికారంలోకి తేవాలన్న మంచి ఆలోచనలతో కష్టపడుతున్న కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని అన్నారు. పార్టీకి నష్టం చేస్తూ బీజేపీ, టిఆర్ఎస్ లకు లాభం జరిగేలా ప్రవర్తిస్తున్న కొంతమంది నాయకులపై అధిష్టానం దృష్టి సారించి వారిని అదుపు చేయాలని మల్లు రవి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement