Friday, November 22, 2024

రాజ్య‌స‌భ విప‌క్ష‌నేత ‘మ‌ల్లికార్జున ఖ‌ర్గే’కి క‌రోనా

గ‌త వారంలో కాంగ్రెస్ పార్టీ పాద‌యాత్ర‌ని ప్రారంభించింది. కాగా క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డి.కె.శివ‌కుమార్ ఈ పాద‌యాత్ర‌కి నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ యాత్ర‌ని క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ధ‌రామయ్య‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గేలు ప్రారంభించారు. కాగా మ‌ల్లికార్జున ఖ‌ర్గేకు క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోయినా క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింద‌ని ఖ‌ర్గే సెక్ర‌ట‌రీ ర‌వీంద్ర గ‌రిమెళ్ల వెల్ల‌డించారు. ఖర్గే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్నార‌ని రవీంద్ర చెప్పారు. కానీ బూస్టర్ డోస్ కి ఇంకా అర్హత పొందలేదన్నారు. ఖర్గేకి చెందిన ఢిల్లీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకొన్నారు. వారికి కూడా కరోనా సోకింది.

ప్రస్తుతం ఈ ఐదుగురు సభ్యులు కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నారని రవీంద్ర తెలిపారు. అర్హత ఉన్న వారంతా కరోనా బూస్టర్ డోస్ వేసుకోవాలని కూడా ఖర్గే కోరారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ ను వేసుకోవాలన్నారు. బూస్టర్ డోస్ వేసుకోవడానికి అంతరాన్ని తగ్గించాలని కూడా ఖర్గే ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ప్రకటనలో మల్లికార్జున ఖర్గే కోరారు. . మరో వైపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ బుధవారం నాడు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హొం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement