కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయం రెండో పంప్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇవ్వాల (ఆదివారం) వేకువ జామున ఇరిగేషన్ ఇంజినీర్లు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. దాదాపు గంటపాటు నిరంతరాయంగా ట్రయల్ చేపట్టినట్టు సమాచారం. ప్యాకేజీ – 9 ఈఈ గంగం శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక.. ట్రయల్ రన్ జరుగుతున్న తీరును కలెక్టర్ అనురాగ్ జయంతి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. రెండో పంపు ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మంత్రి కే తారక రామారావు, జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ – 9లో భాగంగా నిర్మించిన మల్కపేట జలాశయాన్ని 15 నుంచి 20 రోజుల్లో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే మే 23వ తేదీన మొదటి పంపు ట్రయల్ రన్ ను విజయవంతం చేశారు. ఆదివారం వేకువ జామున రెండో పంపు విజయవంతం చేశారు. దీంతో మల్కపేట జలాశయం రెండు పంపుల విజయవంతం అయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.