ప్రభన్యూస్ : నోబెల్ బహుమతి గ్రహీత, మహిళల విద్యకోసం ఉద్యమిస్తున్న మలాలా యూసుఫ్జాయ్ ఇప్పుడు ఆక్సఫర్డ్ యూనివర్శిటీనుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వార్తల్లో నిలిచారు. తత్వ, రాజనీతి, ఆర్థికశాస్ర్తాలలో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంనుంచి పట్టా అందుకున్నారు. తోటి విద్యార్థులు, భర్త, కుటుంబ సభ్యులతో పట్టా అందుకున్న ఫోటోను ఆమె ఇన్స్టాలో పోస్టు చేశారు. తాలిబన్ల ఆంక్షలను ఎదిరించి చదువుకునేందుకు వెళ్లిన ఆమెపై కాల్పులు జదపడంతో తీవ్రంగా గాయపడిన ఆమెకు లండన్ లో అనేక శస్ర్తచికిత్సలు చేసి ప్రాణం పోశారు.
సరిగ్గా కాల్పుల్లో గాయపడిన 9 సంవత్సరాల తరువాత ఆమె ఇప్పుడు గ్రాడ్యుయేట్ గా నిలవడం విశేషం. మహిళలు, ప్రత్యేకించి బాలికల విద్య కోసం ఆమె ప్రాణాలకు తెగించి ఉద్యమించిన విషయం తెలిసిందే. ఆమె ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ వర్శిటీనుంచి పట్టా పొందిన విషయం తెలిసి లక్షలాదిమంది శుభాకాంక్షలు చెబుతున్నారు. ఎంతోమంది బాలికలకు మీరు స్ఫూర్తి అంటూ మెచ్చుకుంటున్నారు. నిజానికి 2020లోనే ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తయి పట్టా స్వీకరించాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారివల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital