Monday, November 18, 2024

సామాన్యులని లక్షాది కారులను చేస్తోన్న.. కేరళ లాటరీ టిక్కెట్స్..నాలుగు లక్షల మందికి జీవనోపాధి కూడా ..

కేరళలో లాటరి అంటే చాలా మందికి అదృష్ట దేవతగా భావిస్తారు లాటరీ ప్రైజ్ ని గెలిచినవారు. ముఖ్యంగా సామాన్యులు, ఆటో వాలాలు ఎక్కువగా ఈ లాటరీ టికెట్లు కొంటుంటారు. అదృష్టవంతులు కొద్ది మందే అయినా.. తమ జీవితంలో ఏదో ఒక రోజు అదృష్టం తలుపు తట్టబోదా అన్న ఆశే లాటరీ వైపు ఆకర్షిస్తోంది. ప్రభుత్వం గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహిస్తుందన్న విమర్శలు సైతం వినిపిస్తుంటాయి. కాసేపు వీటిని పక్కన పెట్టి చూస్తే.. లాటరీ రూపంలో కేరళలో ఎంతో మంది కడుపు నిండుతోంది.ఈ లాటరీ విభాగంలో 899 మంది ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తుంటారు. టికెట్ల ప్రింటింగ్, విక్రయాలు, ప్రచారం, రవాణా, రోజువారీ వ్యవహారాలు వీరు పర్యవేక్షిస్తుంటారు. ఇక 95,896 మంది డైరెక్ట్ ఏజెంట్లు, 2.5-3 లక్షల మంది పరోక్ష ఏజెంట్లు లాటరీపై ఆధారపడి జీవిస్తున్నారు. అంటే సుమారు 4 లక్షల మందికి లాటరీ ఉపాధి కల్పిస్తోంది. సగటున ఒక్కో కుటుంబంలో ఐదుగురు చొప్పున వేసుకున్నా.. 20 లక్షల మందికి లాటరీ అన్నం పెడుతోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం ఏజెంట్ల సంక్షేమం కోసం ఒక బోర్డ్ నిర్వహిస్తోంది. వారి వైద్య చికిత్సల వ్యయాలు, వారి పిల్లల విద్య, ఇతర అవసరాలను ఇది చూస్తుంటుంది. ఇతర పనులు చేయలేని ఎంతో మందికి లాటరీ ఉపాధి కల్పిస్తోందని కొందరు నిపుణుల వాదన.

Advertisement

తాజా వార్తలు

Advertisement