మహీంద్రా కంపెనీ కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. పలు మోడల్స్ పై కొత్త ఆఫర్లు, తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేసిన కార్లపై ఈ నెలలో కస్టమర్‌లు గరిష్టంగా రూ.81,500 వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. ఆఫ్ రోడ్ కార్ థార్, బొలెరో నియో, ఎక్స్‌యూవీ 700 వంటి కార్లపై ఎలాంటి తగ్గింపులేదని ప్రకటించింది. ఈ ప్రయోజనాలు.. ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు మార్పిడి బోనస్, కార్పొరేట్ బోనస్ రూపంలో ఇవ్వనున్నట్టు తెలిపింది. మహీంద్రా కేయూవీ 100ఎన్‌ఎక్స్‌టీపై రూ.38,055 వరకు నగదు తగ్గింపు, రూ.3వేల వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్స్ఛ్‌ంజ్ ఆఫర్ కింద రూ.20వేల తగ్గింపు ఉంటుంది. మహీంద్రా బొలెరో ఎక్స్ఛేంజ్ కింద రూ.15వేలు, కార్పొరేట్ బోనస్ కింద రూ.3వేలు, అదనంగా మరో రూ.6వేల వరకు నగదు ప్రయోజనాలు పొందొచ్చు. స్కార్పియోపై రూ.15వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4వేల కార్పొరేట్ బోనస్, రూ.15వేల అదనంగా ప్రయోజనాలు పొందొచ్చు. అల్టురాస్‌పై ఏకంగా రూ.81,500 తగ్గింపు ఉంది. రూ.50వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.11,500 కార్పొరేట్ తగ్గింపు, రూ.20వేల అదనపు తగ్గింపును ప్రకటించింది.
Big Offer: మహీంద్రా అండ్ మహీంద్రా, కార్ల ధరల్లో భారీ తగ్గింపు.. 81,500 వేల వరకు ఆదా
Advertisement
తాజా వార్తలు
Advertisement