Tuesday, November 19, 2024

మహిళా బంధు మన కేసీఆర్.. క‌ల్యాణల‌క్షి ల‌బ్ధిదారుతో క‌లిసి భోజ‌నం చేసిన‌ ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని అయిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అందిస్తోంద‌ని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఇవ్వాల (సోమ‌వారం) లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన‌ కవిత వారితో కలిసి భోజనం చేశారు.. హైద‌రాబాద్‌లోని గౌరీశంకర్ కాలనీకి విచ్చేసిన ఆమెకు కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోంద‌ని, ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయన్నారు. ఈ ప‌థ‌కాల అమ‌లుతో రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయన్నారు.

తెలంగాణాలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి జరిగినా ప్రభుత్వ సహకారం ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప‌థ‌కాల ద్వారా నిరుపేద కుటుంబీకులు ఎంతో లబ్ది పొందుతున్న‌ట్టు చెప్పారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116/ అందజేస్తున్నారన్నారు. నిరుపేద ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేనమామ వ‌లె ఆడపిల్లల పెళ్లికి డబ్బులు అందించడం సంతోషదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement