హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో మహిళా బంధు కేసీఆర్ పేరిట సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఈ సందర్భంఆ కేటీఆర్ అన్నారు. ఇలా చేయడం దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. సుమారు 11 లక్షల మంది మహిళలకు కేసీఆర్ కిట్ పథకం అమలైందన్నారు. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని శ్రేణులకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.
6న కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన పార్టీ మహిళా నాయకులు కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టాలని కేటీఆర్ సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ఆశ వర్కర్లు, ఎఎన్‌ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లతో పాటు ప్రతిభ కలిగిన విద్యార్థినులు, తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం నిర్వహించాలన్నారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు.
7న లబ్దిదారులతో సెల్ఫీలు…
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాల లబ్దిదారుల నివాసాలకు టీఆర్‌ఎస్ నాయకులు నేరుగా వెళ్లి కలవాలన్నారు. అనంతరం లబ్దిదారులతో ముచ్చటించి, సెల్ఫీలు తీసుకోవాలని సూచించారు.
8న మహిళలతో సమావేశాలు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున(మార్చి 8) నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ చెప్పారు.
మహిళా బంధు కేసీఆర్.. మహిళా దినోత్సవానికి సంబురాలు చేయాలి: కేటీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement