Friday, November 22, 2024

మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప్రెగ్నెన్సీ విద్యార్థినిలకు 60రోజుల మెట‌ర్నిటీ లీవ్

18ఏళ్లు పైబ‌డిన‌..డిగ్రీ లేదా పీజీ విద్యార్థులు కోర్సు చేస్తున్న స‌మ‌యంలో గ‌ర్భం దాల్చితే వారికి 60రోజుల మెట‌ర్నిటీ సెల‌వులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది కేర‌ళ మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ..ఈ మేర‌కు సంచలన నిర్ణయం తీసుకుంది. మెటర్నిటీ సెలవుల కోసం సదరు విద్యార్థి రిజిస్టర్డ్ డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్, అప్లికేషన్‌ను మూడు రోజుల ముందుగా సమర్పించాల్సి ఉంటుంది. వారి చదువులకు ఆటంకం కలుగకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఐ తన కథనంలో వివరించింది. ప్రొ. వైస్ చాన్సిలర్ సీటీ అరవింద్ కుమార్ సారథ్యంలో సిండికేట్ సమావేశంలో అయింది. ఈ సిండికేట్ ఏర్పాటు చేసిన కమిటీ మెటర్నిటీ సెలవులపై అధ్యయనం చేసి సిఫారసులు చేసింది.

అందుకు అనుకూలంగా సిండికేట్ నిర్ణయం తీసుకుంది. ఆ యూనివర్సిటీ ప్రకారం, విద్యార్థులు మెటర్నిటీ సెలవులు డెలివరీకి ముందు లేదా డెలివరీ తర్వాత అయినా తీసుకోవచ్చు. మొదటి లేదా రెండో ప్రెగ్నెన్సీకి మాత్రమే మెటర్నిటీ సెలవులు పొందగలుగుతారు. అదీ కూడా కోర్సు డ్యురేషన్‌లో ఒకేసారి ఈ అవకాశం విద్యార్థులకు ఉంటుంది. ఈ 60 రోజుల మెటర్నిటీ సెలవుల్లో పబ్లిక్, ఆర్డినరీ హాలిడేస్ కలిసే ఉంటాయి. వేరే ఇతర సెలవులు వీటికి జోడించే అవకాశం ఉండదు. అదే అబార్షన్ లేదా ట్యూబెక్టమీ వంటి వాటికి 14 రోజుల సెలవులను యూనివర్సిటీ ఇస్తుంది.

ఈ సెలవుల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్‌ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. వారు ఆ సెమిస్టర్ పరీక్షలను రెగ్యులర్ విద్యార్థులతో కలిసే మరో సెమిస్టర్‌లో సప్లిమెంటరీ పరీక్షలుగా రాసుకోవచ్చు. ఈ మెటర్నిటీ సెలవుల కారణంగా వారు సెమిస్టర్ లాస్ కారని తెలిపింది. మెటర్నిటీ సెలవులు అయిపోగానే వారు యథావిధిగా తమ బ్యాచ్ సెమిస్టర్ విద్యార్థులతో కలిసి చదువు కొనసాగించుకోవచ్చు. మెటర్నిటీ సెలవుల సమయంలో ప్రాక్టికల్ పరీక్షలు, ల్యాబ్, వైవా వంటి పరీక్షలు ఉంటే ఆ ఇన్‌స్టిట్యూషన్ లేదా డిపార్ట్‌మెంట్ హెడ్ అవసరమైన ఏర్పాట్లు చేస్తారని ఆ ప్రకటన తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement