ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకులతం చేస్తోంది. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్క్ లేకుండా బయటకు వెళ్తే ఫైన్ వేస్తున్నారు. చాలామంది ఫైన్ కట్టేందుకు సిద్దమౌతున్నారుగాని, మాస్క్ పెట్టుకోవడం లేదు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అయితే, మాస్క్ లేకుండా బయటికి వచ్చే వారికి జరిమానాలు విధిస్తోంది.
అయితే, ఇప్పటికీ చాలా మందికి మాస్క్ పెట్టుకోవడం అంటే ఇష్టం పడడం లేదు. మహారాష్ట్రలో కరోనా ఎంత తీవ్రంగా ఉందో మనకు తెలుసు. ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు వస్తున్నాయి. అయినా కొంత మంది మాస్క్ వాడటానికి ఇష్టపడట్లేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాలకు వస్తే రూ.200 ఫైన్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు మాస్క లేకుండా ఉన్న 2,03,000 మందికి ఫైన్ వేశారు. ఫలితంగా దాదాపు రూ.4.06 కోట్లు వసూలు అయినట్లు ముంబై పోలీసులు తెలిపారు.