మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామస్మరణలతో మారుమోగాయి. భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పలు శివాలయాలను విద్యుత్దీపాలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. ఏపీలో శ్రీశైలం, తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నీలకంఠుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement