Monday, November 25, 2024

67వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల ప్రకటన

67వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డులను ఎనౌన్స్ చేశారు. అయితే ఇందులో జాతీయ స్థాయిలో పాపుల‌ర్ సినిమాగా మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమా నిలిచింది. ఉత్త‌మ కొరియోగ్రాఫ‌ర్ గా రాజు సుంద‌రం నిలిచారు.

అలాగే బెస్ట్ తెలుగు మూవీ గా నాని నటించిన జెర్సీ నిలిచింది.ఉత్త‌మ త‌మిళ మూవీగా ధనుష్ నటించిన అసుర‌న్ సినిమా నిలిచింది.

ఇక హిందీలో చిచోరే కు అవార్డు దక్కింది. ఉత్త‌మ న‌టిగా మణికర్ణికా సినిమాకి గాను కంగ‌నా ర‌నౌత్ కు అవార్డు లభించింది.

అలాగే నాన్ ఫీచర్ విభాగంలో ఉత్తమ వాయిస్ ఓవర్‌గా వైల్డ్ కర్ణాటక సినిమాకు గానూ సర్ డేవిడ్ అటెన్‌బరగ్‌ అవార్డు పొందారు. ఉత్తమ ఎడిటర్‌గా అర్జున్ సరయా నిలిచారు. సినిమాలకు అత్యంత అనువైన రాష్ట్రంగా సిక్కిం నిలవగా ఉత్తమ సినీ విమర్శకులుగా సోహినీ ఛటోపాధ్యాయ అవార్డు దక్కించుకున్నారు.

  • ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
  • ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)
  • ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
  • ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం(మహర్షి)
  • ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)

67వ జాతీయ చలన చిత్ర అవార్డులు

  • ఉత్తమ నటుడు: ధనుష్‌(అసురన్‌), మనోజ్‌ బాయ్‌పాయ్‌(భోంస్లే)
  • ఉత్తమ నటి: కంగనా రనౌత్‌(ఝాన్సీ)
  • ఉత్తమ దర్శకుడు: బహత్తార్‌ హూరైన్‌
  • ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్‌ ఫైల్స్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విజయ్‌ సేతుపతి(సూపర్‌ డీలక్స్‌)
  • ఉత్తమ చిత్రం(హిందీ): చిచోరే
  • ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ
  • ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్‌
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌: రాజు సుందరం(మహర్షి)
  • ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
  • ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌: మరక్కర్‌ అరబ్‌(మలయాళం)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్టపుత్రో
  • ఉత్తమ మేకప్‌: హెలెన్‌
  • ఉత్తమ గాయకుడు: కేసరి(తేరి మిట్టీ)
  • ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)
Advertisement

తాజా వార్తలు

Advertisement