Monday, November 25, 2024

Maharastra Tour – దేశంలో ప‌రివ‌ర్త‌న తెచ్చే పార్టీ బిఆర్ఎస్ – కెసిఆర్

స‌ర్కోలి – మ‌హారాష్ట్ర – బీఆర్ఎస్ ఎవరికీ ఏ టీమ్ గానీ బి టీమ్ కాద‌ని తేల్చి చెప్పారు బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు . మ‌రాఠీ నేత భ‌గీర‌థ్ బాల్కే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేప‌థ్యంలో పండరీపూర్‌ సమీపంలోని సర్కోలి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ,. దేశంలో పరివర్తన తెచ్చే పార్టీ బిఆర్ఎస్ అని స్పష్టం చేశారు. తమపై కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ, తమది రైతులు, దళితులు, అణగారిన వర్గాల టీమ్‌ అని పేర్కొన్నారు..

 సౌత్ కొరియా, జ‌పాన్, సింగ‌పూర్ మ‌లేషియా, లాంటి చిన్న దేశాలు ఎంతో ప్ర‌గ‌తి సాధించిన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.  చైనా.. ఓ ద‌శ‌లో పేద దేశమ‌ని, కానీ ఇప్పుడు చైనా ఎలా ఉందా తెలుసా అని ప్ర‌శ్నించారు. మ‌నం ఎక్క‌డ ఉన్నామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై ఆలోచించాల్సి అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హారాష్ట్ర‌లో ఏ పార్టీకి అధికారం రాలేదో చెప్పండి.. కాంగ్రెస్‌, శివ‌సేన‌, బీజేపీల‌కు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చారని, చేయాల‌నుకుంటే ఎవ‌రైనా చేస్తారని, కానీ ఆ పార్టీలు ఏమీ చేయ‌లేక‌పోయిన‌ట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

దేశంలో మార్పు కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ స్పష్టంచేశారు. కేంద్రానికి దమ్ముంటే.. దేశంలో ప్రతీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న జల విధానాలను బంగాళాఖాతంలో వేయాలంటూ ఫైర్ అయ్యారు. మనకంటే చిన్న దేశాలు అభివృద్ది చెందాయని.. బీఆఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. రైతులు తమ వెంట ఉంటే తాము ఎవరికో టీమ్‌ అవ్వాల్సిన అవసరమేంటని కేసీఆర్‌ ప్రశ్నించారు. మహారాష్ట్ర వైపు తాము వస్తూ మూడు నెలలు కాలేదని, అప్పుడే తమపై ఎందుకింత ఆక్రోశం, ఆగ్రహమని కేసీఆర్‌ ప్రశ్నించారు.

దేశంలో పరివర్తన వస్తే దేశంలోని ప్రతీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మేకిన్‌ ఇండియా అని చెప్తుంటే దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఎందుకు కనిపిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. మేకిన్‌ ఇండియా ఎక్కడికి పోయిందని నిలదీశారు. విధానాలు మారాల్సిన అవసరం ఉందని, దేశం మారితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్‌ అన్నారు. అందుకే రైతులే ముందుండి న‌డ‌వాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement