కరోనా సీజన్ కావడంతో ప్రజలు మాస్కులు పెట్టుకుని అనంతరం నిర్లక్ష్యంగా వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. వాడిన మాస్కులను ప్రజలు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా పారేయటమే ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు ఓ కంపెనీ ఏకంగా వాడిన ఏకంగా పరుపులు తయారు చేస్తోంది. అదెక్కడో కాదు తెలంగాణ పొరుగున ఉండే మహారాష్ట్రలోనే.
వాడిన మాస్కులతో పరుపులు తయారీ చేస్తున్న ఓ కంపెనీపై మహారాష్ట్ర పోలీసులు దాడి చేశారు. మహారాష్ట్రలోని జలగాం జిల్లాలో ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియాలో ఓ కంపెనీ ఇలా పరుపులు తయారు చేస్తుంది. అసలే మహారాష్ట్రలో రోజుకు 63వేల కేసులు వస్తున్న తరుణంలో వాడిన మాస్కులు సేకరించి, పరుపుల తయారీకి వాడటంపై కంపెనీ యాజమాన్యంపై అధికారులు మండిపడ్డారు. కంపెనీని సీజ్ చేశారు. కాగా మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో 63,294 మందికి వైరస్ సోకగా 349మంది మరణించారు.