మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. థానేలో కుండపోతగా కురుస్తున్న వానలకు రైల్వే ట్రాక్ లు మునిగిపోయాయి. పూణెలోని మూల ముత్త నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఖండక్‌వాస్లా డ్యామ్ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో నీటిని విడుదల చేయడంతో ఖండక్‌వాస్లా బ్రిడ్జి మునిగిపోయింది. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్‌లో కురుస్తున్న భారీ వర్షాలు వచ్చే కొన్ని రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. యూపీలో వర్షాల కారణంగా యూపీలోని వివిధ ప్రాంతాల్లో ఒకే రోజు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement