మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారాపట్టి ఫారెస్ట్ ఏరియాలో పోయిన శనివారం ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు 26 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. కానీ, ఆ ఎన్కౌంటర్లో మరొకరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఆ రోజు 26 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
సీ-60 బలగాలు తాజాగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మరో మావోయిస్టు డెడ్‌బాడీ కూడా దొరికినట్టు పోలీసు ఆఫీసర్లు తెలిపారు. అతని మృతదేహాన్ని ఐడెంటిఫికేషన్ నిర్వహించగా.. దండకారణ్యం స్పెషల్ జోనల్ సమితి సభ్యుడు సుఖ్‍లాల్‍గా గుర్తించారు.
మహారాష్ట్ర-– చత్తీస్‍గఢ్ సరిహద్దుల్లో కీలకమైన మావోయిస్టు లీడర్ సుఖ్‍లాల్. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. 51 కేసుల్లో ప్రధాన నిందితుడు. 20 హత్యలు చేశాడు. 16 విధ్వంసాల్లో కీలక సూత్రధారి.