పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాగా మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 89కి పెరిగిందని అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయి ప్రాంతంలో బుధవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరిని రక్షించినట్లు పాల్ఘర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నాయనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం పాల్ఘర్ జిల్లాలోని వాసాయి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంఘటన నమోదైందని తెలిపారు.
మహారాష్ట్రలో భారీ వర్షాలు -విరిగిపడిన కొండచరియలు-89కి పెరిగిన మృతులసంఖ్య
Advertisement
తాజా వార్తలు
Advertisement