మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సీఎం సంప్రదింపులకు దిగిరాలేదు. రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటేనే వస్తామనడంతో సీఎం ఠాక్రే అసెంబ్లీని రద్దయినా చేస్తాం.. కానీ బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని.. అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నారు. అయితే మహారాష్ట్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది. అయితే మహారాష్ట్రలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి.. సీఎం ఉద్దవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్ వచ్చింది. మరో వైపు శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు కిడ్నాప్ చేశారని అన్నారు. షిండే క్యాంప్ ను వదిలి నితిన్ నాగ్ పూర్ చేరుకున్నారు. ఈ కేబినెట్ భేటీకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఉద్దవ్ ఠాక్రే పాల్గొననున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement