Tuesday, November 26, 2024

విద్యార్థులకు పరీక్షలు రద్దు.. మళ్లీ ప్రమోట్!

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి అధికంగా ఉంది. దీంతో కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా లాడ్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతుల వరకు పరీక్షలు నిర్వహించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరగతుల విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ ప్రకటన చేశారు. 9 ఆపై తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement