మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి అధికంగా ఉంది. దీంతో కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా లాడ్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1 నుంచి 8 తరగతుల వరకు పరీక్షలు నిర్వహించరాదని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరగతుల విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ ప్రకటన చేశారు. 9 ఆపై తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement