ముంబయిలో ఇవ్వాల (ఆదివారం) మావోయిస్టు లీడర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెల్త్ బాగాలేని కారణంగా చికిత్సకోసం హాస్పిటల్‌కు వెళ్తున్న అతడిని చాకచక్యంగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందం ముంబయి నలసోపరా ప్రాంతంలోని రామ్‌నగర్ ధన్వీ వద్ద చాల్‌పై ఈ అటాక్ చేసింది. ఈ క్రమంలో జార్ఖండ్‌కు చెందిన నిషేధిత CPI (మావోయిస్ట్) ప్రాంతీయ కమిటీ సభ్యుడిగా భావిస్తున్న 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసిందని పోలీసుల తెలిపారు..
అరెస్టయిన వ్యక్తి కరు హులాస్ యాదవ్‌గా గుర్తించారు. ఇతను జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా కట్కంసండి తహసీల్‌లోని దొడ్గా గ్రామానికి చెందినవాడుగా చెబుతున్నారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. హులాస్ యాదవ్ 2004 నుంచి మావోయిస్ట్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నాడని, అతనిపై ఇప్పటికే రూ.15 లక్షల రివార్డు ప్రకటించారని తెలిపారు. యాదవ్ వైద్య చికిత్స కోసం మహారాష్ట్రకు వచ్చారు. ఆపరేషన్ గురించి జార్ఖండ్ పోలీసులకు సమాచారం అందడంతో అతనిని పట్టుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.