కత్తికంటే కలం గొప్పదంటారు.. అయితే పేజీలకు పేజీలు చదివినా అర్థంకాని విషయాన్ని ఒక్క గీత గీసి చెప్పొచ్చంటున్నారు నేటితరం కార్టూనిస్టులు. ఎందుకంటే.. సందర్భం ఏదైనా కానీ, పండుగులు, పబ్బాలు, సంబురాలు, సందడి ఏదైనా సరే.. కార్టూన్లు లేనిదే పత్రికలకు ఆ మజా రాదు. అందుకని ఒక్కో పత్రిక ఒక్కో విధంగా కార్టూన్లకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక.. చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్రప్రభ దినపత్రిక అయితే.. నిత్యం కార్టూన్లకు పెద్దపీట వేస్తుంది.
మరి. ఈ సారి ఆంధ్రప్రభ గీతచార్యుడు, నల్లాన్ చక్రవర్తుల మధుసూదనాచార్యులు ఎట్లాంటి అంశాలను బేస్ చేసుకుని మనకు ముందుకు వస్తున్నారో ఈ కార్టూన్లను చూసి తెలుసుకోవచ్చు. ఎక్కువగా సామాజిక అంశాల ఆధారంగా, ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న బాధలను తన కార్టూన్లలో పొందుపరిచారు. అంతేకాకుండా ఫన్నీగా ఉండేలా.. ప్రజలకు ఈజీగా అర్థం అయ్యేలా రూపొందించారు. ఇక.. దసరా పండుగవేల మీరూ వీటిని చూసి కాసేపు నవ్వుకోండి.. కామెంట్స్ రూపంలో మీ విలువైన సలహాలు, సూచనలు తెలియజేయండి.