Thursday, November 21, 2024

అద్భుతం: కేసీఆర్​ ఎకోపార్కుకు 100 ఏండ్లనాటి చెట్లు.. పాలమూరులో ట్రాన్స్​లొకేషన్ సక్సెస్​​

మహబూబ్​నగర్​లో అద్భతం జరిగింది. 100 ఏండ్ల నాటి పురాతన వృక్షాలను వేళ్లతో సహా పెకిలించి వాటిని మరో చోటుకు మార్చేశారు. దీన్ని ఎంతో పకడ్భందీగా తరలించడానికి గ్రీన్​ ఇండియా చాలెంజ్​, వాటా ఫౌండేషన్​ ఎంతో కృషిచేశాయి.  దీనికి కృషిచేసిన అధికారులను మంత్రి శ్రీనివాస్​గౌడ్​, ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​, జిల్లా కలెక్టర్​ వెంకట్రావు అభినందించారు.

ఒక వినూత్న చొరవతో మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం రోడ్లు, భవనాల గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ కు 100 సంవత్సరాల వయస్సు గల నాలుగు చెట్లను ట్రాన్స్​లొకేట్​ చేసింది. ప్రస్తుతం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో జిల్లా యంత్రాంగం సమీకృత మాంసం, కూరగాయల మార్కెట్‌ను నిర్మిస్తుండడంతో ఈ పురాతన చెట్ల ట్రాన్స్ లోకేషన్ తప్పనిసరి అయ్యింది.

ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి శ్రీనివాస్‌ గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్‌రావు ఆధ్వర్యంలో ఈ ట్రాన్స్ లోకేషన్‌, ప్లాంటేషన్‌ జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం గ్రీన్ ఇండియా చాలెంజ్, పట్టణ సరిహద్దుల్లోని ఇతర సంస్థల సహకారంతో ఈ చెట్లను మార్చింది. చెట్లను తరలించడంలో కీలక పాత్ర పోషించిన గ్రీన్ ఇండియా చాలెంజ్, వాటా ఫౌండేషన్.. పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ భాస్కర్, ఇతర ఇంజినీరింగ్ సిబ్బంది కృషిని మంత్రి శ్రీనివాస్​గౌడ్​, జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాకేష్‌ పాల్గొన్నారు.,

‘‘ప్రకృతి మాతకు ఎటువంటి హాని కలగకుండా అభివృద్ధి చేయండి. ఈ పురాతన వేప చెట్లను Kcrకి తరలించడానికి కృషి చేసినందుకు మంత్రి @VSrinivasGoud గారు,@Collector_MBNR గారు.. @vata_foundation కృషిని అభినందిస్తున్నాం. -ఎకో పార్క్ నిబద్ధతకు అభినందనలు”  అని టీఆర్​ఎస్​ ఎంపీ సంతోష్ కుమార్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. ట్రాన్స్ లోకేషన్‌ను సక్రమంగా చేయడం కోసం మహబూబ్‌నగర్ వాసులు చేసిన కృషిని అభినందించారు. ఎలాంటి నష్టం జరగకుండా మొక్కలు నాటడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement