మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు పోలీసులు ఝలక్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఆదివారం టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు 17 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు 12 మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండటంతో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు అనుమతి లేదని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement