ఊరి చెరువు వద్ద ఓ వృద్ధుడు అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకి సమాచారం అందింది. దాంతో తక్షణమే అక్కడికి చేరుకున్నారు ఎస్ఐ బండారి రాజు. ఆ వృద్ధుడు నడవలేని స్థితిలో ఉన్నాడు. కరోనా దృష్ట్యా అతనిని తాకేందుకు ఎవరూ సాహసించలేదు. దాంతో ఎస్ ఐ స్వయంగా ఆయనకు లుంగీ కట్టి, చొక్కా తొడిగి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే, అక్కడి వరకు అంబులెన్స్ వచ్చేందుకు అనువుగా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎస్సై సాహసం చేశారు. వృద్ధుడిని తన భుజాలపై వేసుకుని కిలోమీటరు దూరం నడిచి అంబులెన్స్ వద్దకు చేర్చారు. అక్కడి నుంచి మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు నిలిపారు. వృద్ధుడి ప్రాణాలు నిలిపేందుకు సాహసం చేసిన ఎస్ ఐ పై ప్రశంసలు కురిపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..