తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ పరిరక్షణ, సంస్థ డెవలప్మెంట్ కోసం కొత్త కొత్త స్కీములను తీసుకొస్తున్నారు. ఆయన బాధ్యతలు తీసుకునే వరకు ఆర్టీసీ అంటే అందరికీ చులకన భావం ఉండేది. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీఎస్ఆర్టీసీ రేంజ్‌ను ఒక లెవల్లో పెంచేశారు సజ్జనార్. మొన్నటి వరకు మేడారం జాతరకు మునుపెన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తున బస్సులను నడిపారు. పండుగల టైమ్‌లో కూడా ప్రత్యేకంగా చార్జీలు విధించకుండా రెగ్యులర్ చార్జీలతోనే వెళ్లేలా వెసులుబాటు కల్పించారు.. కాగా ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు సజ్జనార్.
మహాశివరాత్రి రోజు (మార్చి1న) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) జారీ చేసిన ఆఫర్లో ప్రజలు RTC బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. బస్సు సర్వీసులను అద్దెకు తీసుకోవాలనుకునే వారు 040-3010 2829కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. /040- 6815 3333 అని TSRTC వైస్-ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్ తెలిపారు. అయితే, ఒక ప్రయాణానికి కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉంటుంది.
మహా శివరాత్రి రోజున కీసరగుట్టతో పాటు నగరంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తుతారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు నిర్వహించనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్- మహమ్మారి నేపథ్యంలో వేములవాడ జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు.