మహా శివరాత్రి సందర్భంగా కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోనుంది. దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఇవ్వాల కీలక ప్రకటన చేశారు. ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో తలుపు తెరిచే తేదీలను ప్రకటించారు. కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మే 6వ తేదీ నుంచి ఓపెన్ చేయనున్నారు. కాగా, భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కేదార్‌నాథ్ డోలి మే 2వ తేదీన ఓంకారేశ్వర్ ఆలయం నుండి బయలుదేరుతుంది.
కేదార్‌నాథ్ డోలీ వివరాలు
మే 2వ తేదీన ఓంకారేశ్వర్ ఆలయం నుండి డోలి బయలుదేరగా, మే 3వ తేదీన విశ్వనాథ్ టెంపుల్ గుప్తకాశీ నుండి బయలుదేరుతుంది. మే 4న ఫాటా నుంచి బయలుదేరి సోన్‌ప్రయాగ్ మీదుగా గౌరీకుండ్‌లో రాత్రి బస చేస్తారు. మే 5న గౌరీకుండ్ నుంచి బయలుదేరి జంగిల్‌చట్టి, లించోలి, రుద్ర పాయింట్ మీదుగా కేదార్‌నాథ్ చేరుకుంటుంది. కేదార్‌నాథ్ యాత్రకు సన్నాహాలు కూడా ప్రారంభమైనట్టు అధికారులు వెల్లడించారు.