ప్రగతిభవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు కెసిఆర్ పుష్పాంజలి ఘటించారు. పలువురు ప్రజాప్రతినిధులు, సిఎస్, డీజీపీ, సీఎంవో అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు గణతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.అనంతరం పెరేడ్ గ్రౌండ్ లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.పలువురు ప్రజాప్రతినిధులు, సీస్ శ్రీ సోమేశ్ కుమార్, డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి, సీఎంఓ అధికారులు, తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అటు తెలంగాణ స్టేట్ లోని అన్ని జిల్లాలోనూ కలెక్టర్లు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..