Wednesday, November 20, 2024

త‌మిళ‌నాడును వ‌ణికిస్తోన్న ‘మద్రాస్ ఐ’

కరోనా మ‌హమ్మారి నుంచి బయటపడ్డామ‌నుకుంటున్న తరుణంలో తమిళనాడు ప్రజలకు ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. ఆ ప్రాంత‌ ప్రజలను ‘మద్రాస్ ఐ’ (కండ్ల కలక) వణికిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు మొదటి వారం నుంచి తమిళనాడులో ‘మద్రాస్ ఐ’ విజృంభిస్తోంది. కంటి వాపు, ఎరుపు, కంట్లోంచి నీరు కారడం ‘మద్రాస్ ఐ’ లక్షణాలు. ‘మద్రాస్ ఐ’ కార‌ణంగా త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. భారీ వ‌ర్షాల‌తో ఈ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్కో ఆస్ప‌త్రిలో రోజుకు 200 నుంచి 250 వ‌ర‌కు ఈ కేసులు న‌మోద‌వుతున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇది సోకితే మిగతా వారు నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తమిళనాడు మంత్రి సుబ్రహ్మణ్యం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement