Thursday, November 21, 2024

Fake Story | హోంవర్క్ తప్పించుకునేందుకు కిడ్నాప్​ స్టోరీ.. పోలీసుల ఎంక్వైరీతో వాస్తవం వెలుగులోకి

6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలుడు కిడ్నాప్​ డ్రామాకి తెరతీశాడు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేశారని తల్లిదండ్రులతో చెప్పి ఓ బిగ్​ సీన్​ క్రియేట్​ చేశాడు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు కేసు దర్యాప్తు ప్రారంభించిన వెంటనే ఆ బాలుడి నాటకం బయట పడింది. విచారణలో భాగంగా బాలుడు తన హోంవర్క్ చేయకుండా ఉండేందుకు ఈ కిడ్నాప్​ స్టోరీ చెప్పినట్టు ఒప్పుకున్నాడు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా, జున్నార్డియో మునిసిపాలిటీకి చెందిన బాలుడు.. తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా జున్నార్డియో నుండి చింద్వారాకు మెము రైలులో వెళ్లాడు. అయితే తాను రైలు జర్నీ చేసినట్టు తెలిస్తే తల్లిదండ్రులు కొడతారన్నభయంతో ఆ బాలుడు తనను కిడ్నాప్ చేశారని ఫేక్ స్టోరీని సృష్టించాడు. ఈ విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. రెండు గంటల తర్వాత ఆ బాలుడు రైలులో కనిపించాడు.

సోమవారం ఉదయం తన స్కూల్‌లోని బాత్‌రూమ్‌కి వెళ్లిన సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి తన ముఖానికి నల్లరంగు ముసుగు కప్పి అపహరించారని విద్యార్థి ప్రభుత్వ రైల్వే పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపాడు. అప్పడు నిందితులు తనను రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారని, మార్గమధ్యలో అతన్ని వేరే ప్రదేశానికి తీసుకెళ్లడం గురించి చర్చిస్తున్నారని అతను చెప్పాడు. అయితే.. రైలులో విద్యార్థిని గమనించిన ఇరుగుపొరుగు వారు ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. నిందితులు రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారని, అంతలోనే తాను తప్పించుకుని స్టేషన్‌లో మెము రైలు ఎక్కి తప్పించుకున్నట్టు స్టోరీ క్రియేట్​ చేశాడు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement