Tuesday, November 19, 2024

స్కూటర్‌పైనే పాఠశాల.. ఓ టీచర్ వినూత్న ప్రయోగం

కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పలువురు విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులను ఆదుకునేందుకు, వారిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పలువురు ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీవాస్తవ వార్తల్లో నిలిచారు. శ్రీవాస్తవ తన స్కూటర్‌పై మినీ లైబ్రరీని ఏర్పాటు చేసి సాగర్‌లోని వివిధ గ్రామాల్లోని విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో చాలామంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులున్నారు. వారికి స్మార్ట్‌ఫోన్‌లు కొనలేని కారణంగా ఆన్‌లైన్ విద్య పొందలేకపోతున్నారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ వాత్సవ చెప్పారు. ఏది ఏమైనా పిల్లలు చదువుకోవడమే తన లక్ష్యమని అన్నారు. కాగా శ్రీవాత్సవ వినూత్న ప్రయోగంపై పలువురి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement