అతనో పోలీస్. మరి పోలీస్ అన్నాక కొన్ని రూల్స్ పాటించాల్సిదే కదా. ఆ విషయాన్ని విస్మరించి ఓ పోలీసుకానిస్టేబుల్ భారీగా తన మీసాల్ని పెంచాడు. ఆ మీసాలు ఆయన మెడ వెనుక వరకు పెరిగాయి. దాంతో ఉన్నతాధికారులు ఆ మీసాల్ని ట్రిమ్ చేయాలని చెప్పడంతో అందుకు పోలీస్ కానిస్టేబుల్ రాకేశ్ రాణా కుదరదని తేల్చి చెప్పాడు. అంతేకాదు మీసాల్ని పెంచడం తమ ఇంటి సంప్రదాయం, ఆత్మగౌరవం అని చెప్పాడు. దాంతో ఉన్నతాధికారులు రాకేశ్ ని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. రాకేశ్ ఎపిసోడ్.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. విధి నిర్వహణ విషయంలోనూ తన కమిట్ మెంట్ ను ఇరు వర్గాల వారు మరోసారి ప్రదర్శించారు. తనని సస్పెండ్ చేసినా సరే.. తాను మాత్రం మీసాల్ని ట్రిమ్ చేసేది లేదని స్పష్టం చేశాడు.
ఉద్యోగపరంగా తన మీద ఎలాంటి ఫిర్యాదులు లేవని.. మీసాలు ఉండటం తనకు గర్వకారణం అన్నాడు.కాగా రాకేశ్ ఉదంతం అన్నిమీడియాలో ప్రముఖంగా రావటం.. అతడి మాటలకు పలువురు ఫిదా అయ్యారు. అదే సమయంలో మీసాల్ని భారీగా పెంచేసిన ఈ పోలీసు ఉద్యోగి మైండ్ సెట్ ఏమిటన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టతకు వచ్చింది. అంతేకాదు.. అతన్ని పిలిపించుకొని.. అతనిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేశారు ప్రభుత్వ ఉన్నతాధికారులు. అతనిపై విడుదల చేసిన ఉత్వర్తులను వెనక్కి తీసుకున్నారు. దీంతో.. రాకేశ్ రాణా మళ్లీ పోలీస్ శాఖలోని మోటార్ వెహికల్ విభాగపు డ్రైవర్ గా విధుల్లో చేరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..