హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. మా సభ్యుల సంక్షేమమే మాకు పరమావధి అన్నారు. ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తమన్నారు. అంతేకాకుండా బిల్లుల్లో రాయితీలు లభిస్తాయన్నారు.ప్రతి ఆసుపత్రిలోనూ ప్రతి ఒక్క ‘మా’ సభ్యుడి పేరిట ప్రత్యేక ఫైల్ ఏర్పాటు చేస్తారని, ఆ ఫైల్ లో సదరు సభ్యుడి ఆరోగ్య వివరాలు అన్నీ ఉంటాయని మంచు విష్ణు తెలిపారు. మహిళా సభ్యులు రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్ల చికిత్సలు కూడా పొందవచ్చని అన్నారు.
ఈ నేపథ్యంలో తాను డాక్టర్ నాగేశ్వర రెడ్డి (ఏఐజీ), డాక్టర్ భాస్కర్ రావు (కిమ్స్), శ్రీమతి సంగీత (అపోలో), డాక్టర్ సుబ్రమణియమ్ (అపోలో సీఈఓ), డాక్టర్ గురవారెడ్డి (సన్ షైన్ హాస్పిటల్స్), డాక్టర్ అనిల్ కృష్ణ (మెడికవర్) లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని విష్ణు వెల్లడించారు. ఇక, టెనెట్ డయాగ్నస్టిక్స్ లో 50 శాతం రాయితీతో వైద్య పరీక్షల సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వివరించారు.