Thursday, November 21, 2024

బీఎస్ఎఫ్ ఆఫీసర్ ఇంట్లో లగ్జరీ కార్లు, బ్యాగుల నిండా నగలు.. కోట్లకొద్దీ నోట్ల కట్టలు..

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG)లో జాబ్ చేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కి చెందిన ఓ అధికారి నుంచి లగ్జరీ కార్లు, కోట్లకొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇది హర్యానా రాష్ట్రం గుర్గావ్ జిల్లాలోని మనేసర్‌ జరిగింది. 125కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై బీఎస్ఎఫ్ కమాండెంట్ ప్రవీణ్ యాదవ్ ఇంట్లో సోదాలు చేశారు. దీంతో కండ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగుచూశాయి. అతని ఇంట్లో విలాసవంతమైన కార్లు, బ్యాగుల నిండా నగలు,14 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

125 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై బీఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ప్రవీణ్ యాదవ్, ఆయన భార్య మమతా యాదవ్, బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న సోదరి రీతులను జనవరి 14న హర్యానా పోలీసులు అరెస్ట్ చేసినట్లు గురుగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) ప్రీత్‌పాల్ సింగ్ తెలిపారు. డిప్యూటీ కమాండెంట్ యాదవ్, అతని భార్య, సోదరితో కలిసి NSG క్యాంపస్‌లో నిర్మాణ పనులు ఇప్పిస్తానని సాకుతో బిల్డర్ల నుండి లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు.

యాదవ్ స్టాక్ మార్కెట్‌లో రూ. 60 లక్షలు పోగొట్టుకున్నారని, ప్రజలను మోసం చేయడం ద్వారా డబ్బును రికవరీ చేసేందుకు కుట్ర పన్నారని ఏసీపీ సింగ్ చెప్పారు. “అతను మోసం చేసిన మొత్తం డబ్బును NSG పేరుతో నకిలీ ఖాతాకు బదిలీ చేసాడు. యాక్సిస్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న అతని సోదరి రీతూ యాదవ్‌ ఈ ఖాతాను తెరిచినట్లు పోలీసులు తెలిపారు. కాగా, బీఎమ్‌డబ్ల్యూ, జీప్, మెర్సిడెస్‌తో సహా లగ్జరీ కార్లను యాదవ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement