Friday, October 4, 2024

Lukcy Bug – అదృష్టం తెచ్చే స్టాగ్ బీటిల్‌.. ఒక్కో పురుగు ధ‌ర 75 ల‌క్ష‌లు

ఈ విష‌యం చ‌దివితే.. ఇక ‘‘పురుగులా చూశారు.. పురుగుకన్నా హీనంగా తీసిప‌డేశారు’’ అనే మాట అన‌రేమో.. ఎందుకంటే, కొన్ని పురుగులు బీఎండబ్ల్యూ, ఆడి లాంటి లగ్జరీ కార్లంత ధర పలికుతున్నాయి. ఇప్పుడు అలాంటి పురుగుల కోసం లక్షల రూపాయ‌లు వెచ్చించేందుకు కొందరు ఎగబడుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన కీటకాల్లో ఒకటైన స్టాగ్ బీటిల్ ప్ర‌ఖ్యాతిగాంచింది. ప్రస్తుతం దీని ధ‌ర కళ్లుచెదిరేలా ఏకంగా రూ. 75 లక్షలు పలుకుతోంది.

కుమ్మ‌రిపురుగు, పేడ పురుగు వంటిదే..వాస్త‌వంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన కుమ్మరి పురుగు, పేడ పురుగు వంటిదే. కాకపోతే వాటిలో ఇవి ఓ ప్రత్యేకమైన రకం అని చెప్పుకోవ‌చ్చు. దుప్పులకు తలపై కొమ్ములు ఉన్నట్లుగానే ఈ పురుగులకు కూడా రెండు కొమ్ములుంటాయి. అందుకే వీటికి స్టాగ్ బీటిల్ అనే పేరు వచ్చింది.

- Advertisement -

ఇంతకీ వీటి స్పెషాలిటీ ఏంటి? అంత రేటు ఎందుకు అన్న సందేహాలు చాలామంది నుంచి వ‌స్తున్నాయి. అయితే.. ఇవి అదృష్ట కీటకాలని, ఇంట్లో కాలుపెట్టగానే ఇంటి ఓనర్‌కు లక్ తన్నుకొస్తుంద‌నే విశ్వాసం చాలామందిలో ఉంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసేస్తుంద‌ని చాలామంది న‌మ్ముతున్నారు. అందుకే ఎంత ధర అయినా వెచ్చించేందుకు ఔత్సాహికులు వెనకాడటం లేదు. పైగా ఈ పురుగు అరుదైన జాతికి చెందినది కావడం కూడా వాటి భారీ ధరకు కారణమవుతోందనే వాద‌న‌లున్నాయి.

తోట‌లు, పార్కుల్లో ఉండే జీవి..లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం తెలిపిన వివరాల ప్రకారం.. స్టాగ్ బీటిల్ పురుగులు 2 నుంచి 6 గ్రాముల మధ్య బరువు ఉంటాయి. సగటున మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జీవిస్తాయి. మగ పురుగులు 3.5 సెంటీమీటర్ల నుంచి 7.5 సెంటీమీటర్ల పొడవుంటే.. ఆడ పురుగులు మాత్రం 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవే ఉంటాయి. ఈ పురుగులను ఔషధాల కోసం కూడా ఉపయోగిస్తుంటారు.

ఇక‌.. స్టాగ్ బీటిల్స్ చలిని తట్టుకోలేవు. అందుకే ఇవి ఉష్ణ మండల ప్రాంతాల్లో నివసిస్తాయి. తోటలు, పార్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చచ్చిపోయి కుళ్లిపోయే చెట్లపైన కూడా జీవిస్తాయి. చెట్లలోని తీయని ద్రవాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అలాగే కుళ్లిన పండ్లలోని రసాన్ని తాగుతాయి. మ‌రి మీ ల‌క్కేంటో చూస్కోండి.. ఒక్క స్టాగ్ బీటిల్ పురుగు దొరికానా ద‌శ తిరిగిన‌ట్టే.. ల‌క్కు మీకు చిక్కిన‌ట్టే..

Advertisement

తాజా వార్తలు

Advertisement