లడ్డూలకు భారీగా ఆర్డర్లు ఇస్తున్నారట పలు పార్టీల రాజకీయ నాయకులు. పంజాబ్ లో ఎన్నికల ఫలితాలకు ముందు కోలాహల వాతావరణం నెలకొంది. దాంతో విజయం తమదంటే తమదేనని బలంగా నమ్ముతున్నారు పలు పార్టీల అభ్యర్థులు. ఫలితాల తర్వాత విజయ సంబురాలకు ముందే సన్నద్దమవుతున్నారు. దీంతో స్వీట్ల తయారీ సంస్థలకు చేతి నిండా పని లభించింది. పంజాబీలు లడ్డూలను ఎక్కువగా ఇష్టపడతారు. దీంతో గెలుపు తర్వాత సంబరాల్లో లడ్డూలను పంచి పెట్టేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో తయారీ ఆర్డర్లు ఇచ్చారు. స్వీట్ హోమ్ లలో తయారీ ఫొటోలు చూస్తే వారెంత బిజీగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు.
ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ సంస్థలు పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)యే విజయం సాధిస్తుందని చెప్పడం తెలిసిందే. మొత్తం 117 స్థానాలకు గాను ఆప్ 70 నుంచి 100 స్థానాల వరకు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ, ఇండియా టుడే, చాణక్య సంస్థలు చెప్పగా.. ఒక్క ఏబీపీ-సీ ఓటర్ మాత్రం ఆప్ 57, కాంగ్రెస్ 26, అకాలీదళ్ 24, బీజేపీ 10 గెలుచుకుంటుందని చెప్పడం గమనార్హం.
ఎన్నికల ఫలితాలు – లడ్డూలకు భారీగా ఆర్డర్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement