Saturday, November 23, 2024

Breaking: దీటుగా ఆడుతున్న లక్నో.. 10 ఓవర్లకు 66/3

టాటా ఐపీఎల్​ 2022లో భాగంగా ఇవ్వాల ముంబైలో 63వ మ్యాచ్​ జరుగుతోంది. ఈ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​, లక్నో సూపర్​ జెయింట్స్​ తలపడుతున్నాయి. ఫస్ట్​ బ్యాటింగ్​ చేసిన రాజస్థాన్​ జట్టు బ్యాటింగ్​లో తడబడింది. నిర్ణీత ఓవర్లలో 178 పరుగులు చేసి, లక్నోకి 179 పరుగుల టార్గెట్​ పెట్టింది. కాగా, లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లక్నో జట్టు తొలి 8 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు పోగొట్టుకుంది. 10వ ఓవర్​ వరకు 66 పరుగులు చేసి 3 వికెట్ల నష్టంతో బ్యాటింగ్​ కొనసాగిస్తున్నారు. కాగా, కృణాల్​ పాండ్యా, దీపక్​ హుడా లక్నో జట్టును ముందుకు నడిపిస్తున్నారు.

అయితే.. ఆరంభంలోనే రాజస్థాన్​ ఆటగాళ్లు జోస్ బట్లర్ (2) అవుటైనా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (41), సంజూ శాంసన్ (32), పడిక్కల్ (39) రాణించారు. దాంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన రాజస్థాన్‌ను రవి బిష్ణోయి, బదోనీ దెబ్బ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (19), జేమ్స్ నీషమ్ (19) భారీ షాట్లు ఆడలేకపోయారు.

చివర్లో బౌల్ట్ (17 నాటౌట్), అశ్విన్ (10 నాటౌట్) కలిసి మూడు ఫోర్లు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో బిష్ణోయి రెండు వికెట్లతో సత్తా చాటగా.. హోల్డర్, బదోని, ఆవేష్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement