Sunday, November 24, 2024

ల‌క్క్ అంటే వీరిదే – స‌ర‌దాగా కొన్న లాట‌రీ టిక్కెట్ కి రూ.10కోట్ల మ‌నీ ప్రైజ్

స‌ర‌దాగా కొన్న లాట‌రీ టిక్కెట్ తో కోటీశ్వ‌రుల‌య్యారు.. విదేశాల నుంచి వచ్చిన తమ బంధువును తీసుకొచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. అక్కడ సరదాగా లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. వీరు కొనుగోలు చేసిన టిక్కెట్‌కు రూ.10 కోట్ల బంపర్ లాటరీ వరించింది. తమిళనాడుకు చెందిన వ్య‌క్తులు .. కేరళ విషు బంపర్ లాటరీ విజేతలుగా నిలిచారు. కన్యాకుమారికి చెందిన డాక్టర్ ఎం ప్రదీప్, అతడి బంధువు ఎన్ రమేశ్‌లకు కేరళలో జాక్ పాట్ తగిలింది. ఒకే కుటుంబానికి చెందిన ప్రవీణ్, రమేశ్‌లు కొద్ది రోజుల కిందట విదేశాల నుంచి వచ్చిన తమ బంధువును రిసీవ్ చేసుకోడానికి కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఓ ఏజెంట్ వద్ద టికెట్ కొనుగోలు చేశారు. అయితే ఊహించని విధంగా వీరు కొనుగోలు చేసిన టికెట్కే రూ.10కోట్ల లాటరీ తగిలింది. వాస్తవానికి ఈ టిక్కెట్‌ను తిరువనంతపురంలోని పజవంగడి వద్ద ఉన్న చైతన్య లక్కీ సెంటర్‌లో రంగన్, జసీంత అనే దంపతులు తొలుత కొన్నారు. తర్వాత దీనిని ప్రవీణ్, రమేశ్‌లకు విమానాశ్రయ ప్రాంగణం దగ్గర విక్రయించారు.మే 22న ఈ లాటరీ డ్రా తీయగా… ప్రదీప్, రమేశ్ కొనుగోలు చేసిన HB 727990 టిక్కెట్‌ ఎంపికయ్యింది. రూ.10 కోట్లు గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే, ఈ టిక్కెట్ ఎవరూ కొనుగోలు చేశారనేది వారం రోజుల వరకూ సమాచారం లేదు. వారి గురించి అధికారులు ఆరా తీశారు. అయితే, చివరకు ప్రవీశ్, రమేశ్‌లకు ఈ విషయం తెలియడంతో వాళ్లు లాటరీ భవన్ కి వెళ్లి టికెట్ తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించారు. లాటరీ రూ.10 కోట్లలో పన్నులు పోగా మిగతా మొత్తాన్ని అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement