లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఇండియన్ ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా ఇవ్వాల బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ చండీ ప్రసాద్ మహంతి నుండి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. పాండే, కోల్‌కతాలోని తూర్పు కమాండ్‌కు నాయకత్వం వహించిన తర్వాత ఆర్మీ ప్రధాన కార్యాలయానికి వస్తారని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి రాష్ట్రాలలో తూర్పు సెక్టార్‌లో చైనాకు వ్యతిరేకంగా రక్షణ బాధ్యతలు నిర్వహించాల్సిన బాధ్యత తూర్పు కమాండ్‌కి ఉంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన పాండే.. డిసెంబర్ 1982లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ (ది బాంబే సాపర్స్)కి నియమితులయ్యారు. జమ్మూ, కాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి సున్నితమైన పల్లన్‌వాలా సెక్టార్‌లో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో జనరల్ ఆఫీసర్ ఇంజనీర్ రెజిమెంట్‌కు మనోజ్‌పాండే నాయకత్వం వహించారు.
తన 39 సంవత్సరాలసైనిక జీవితంలోజమ్మూ, కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వివిధ వాతావరణ పరిస్థితుల్లో రక్షణను సవాలుగా తీసుకుని పనిచేశరు. పశ్చిమ లడఖ్‌లోని హై ఆల్టిట్యూడ్ ఏరియాలోని మౌంటైన్ డివిజన్, నార్త్ ఈస్ట్‌లో కార్ప్స్, కమాండర్-ఇన్-చీఫ్ అండమాన్ & నికోబార్ కమాండ్ (CINCAN), ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా జనరల్ ఆఫీసర్ ఇథియోపియా, ఎరిట్రియాలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌లో చీఫ్ ఇంజనీర్‌గా కూడా పనిచేశారు. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ADGMO-B), హెడ్‌క్వార్టర్స్ సదరన్ కమాండ్‌లోని చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో డైరెక్టర్ జనరల్ డిసిప్లిన్ సెరిమోనియల్ & వెల్ఫేర్ నియామకాలను పర్యవేక్షించారు. ఎన్నో అవార్డులును కూడా పొందినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.