Friday, November 22, 2024

వినియోగారులకు షాక్.. పెరగనున్న గ్యాస్ ధరలు

ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రభావం ఇప్పుడు సామాన్యులపై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. తాజాగా ఇప్పుడు డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను కూడా పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేయాలని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను కంపెనీలు రూ.105 వరకు పెంచాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1907 నుంచి రూ.2012కు చేరింది. అయితే, గతేడాది అక్టోబర్ నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement