Friday, November 22, 2024

తెలంగాణపై చలి పంజా.. పడిపోతున్న ఉష్టోగ్రతలు

తెలంగాణలో ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్య భారతం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో రానున్న రోజుల్లో ఉష్టోగ్రతలు తగ్గి  చలి మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. పగటి పూట సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. రాత్రి మాత్రం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని పేర్కొంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగుజాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: మునుగోడులో షర్మిల ప్రజాప్రస్థానం

Advertisement

తాజా వార్తలు

Advertisement