తెలంగాణలో గత రెండు రోజులుగా చలి తీవ్రత కొంతమేరకు తగ్గింది. అయితే, ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో చలి అధికంగా ఉంటుందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో సగటు కంటే 2-4 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది.
కాగా, శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని సోనాలలో 8.8 డిగ్రీలు, అర్లి (టి)లో 9.5, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లోని గిన్నెదరిలో 9.2, రంగారెడ్డిలోని రెడ్డిపల్లిలో 9.1 మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..