Friday, November 22, 2024

బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఆపై తుపాను

బంగాళాఖాతంలో నేడు అల్ప పీడనం ఏర్పడనున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో రేపు అది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ బంగాళాఖాతం వైపు కదులుతూ తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు. ఈ తుపాను వేగం, దిశ, తీవ్రత, అది ప్రయాణించే మార్గంపై రేపటికి స్పష్టత వస్తుందన్నారు.

తుపాను కనుక ఉత్తర దిశగా కదిలితే ఇక్కడి తేమంతా అటువైపు వెళ్లి తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పశ్చిమ దిశగా వెళ్తే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. అలాగే, నేడు కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement