తన భర్తపై ఉన్న ప్రేమతో నటి రాఖీ సావంత్ టాటూని వేయించుకుంది.కానీ వారి వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. దాంతో తాజాగా ఆ పేరును తీయించుకుంది. టాటూను తొలగించేటప్పుడు ఎంతో నొప్పి కలిగినా… దాన్ని భరిస్తూ అతని పేరును శరీరంపై నుంచి కూడా శాశ్వతంగా తొలగించింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె స్పందిస్తూ… ‘రితేశ్ నువ్వు నా జీవితం నుంచే కాదు, నా శరీరం నుంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోయిట్టే’ అని చెప్పింది. అంతేకాదు ప్రేమలో ఉండే వారికి ఓ సూచన కూడా చేసింది. ప్రేమలో మునిగితేలేవాళ్లు పచ్చబొట్టు మాత్రం వేయించుకోవద్దని… ఎందుకంటే దాన్ని తీసేయడం చాలా కష్టమని చెప్పింది.
ప్రేమికులు పచ్చబొట్లు వేయించుకొవద్దు-తొలగించడం చాలా కష్టం- రాఖీసావంత్
Advertisement
తాజా వార్తలు
Advertisement