Thursday, November 21, 2024

కుమార్తె మెడ‌లో మంగ‌ళ‌సూత్రం తెంచిన క‌న్న తండ్రి – ఎందుకో తెలుసా


కుమారై ప్రేమ వివాహం చేసుకుంద‌న్న కోపంతో ర‌గిలిపోయిన తండ్రి ఆమె మెడ‌లోంచి మంగ‌ళ‌సూత్రాన్ని తెంపాడు. ఈ సంఘ‌ట‌న క‌ర్నాక‌ట రాష్ట్రంలో క‌ల‌క‌లం సృష్టించింది. వివారాల్లోకి వెళ్తే ..చైత్ర‌, మ‌హేంద్ర‌లు గ‌త ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే అమ్మాయి ఇంట్లో తండ్రి ఒప్పుకోలేదు. అమ్మాయిది నంజ‌న‌గూడు ప్రాంతానికి చెందిన హ‌ర‌త‌ళె. అబ్బాయిది ప‌క్క‌నే హ‌ల్శెర గ్రామం. త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి పెళ్లి చేసుకుందామ‌నుకున్నారు. కానీ చైత్ర తండ్రి బ‌వ‌స‌రాజు నాయ‌క్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో వారిద్ద‌రూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు.

నంజ‌న‌గూడుకు వ‌చ్చారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని వ‌చ్చినందుకు అమ్మాయి తండ్రి వారిద్ద‌రిని అడ్డుకొని గొడ‌వ చేశాడు. భ‌ర్త ప‌క్క‌న ఉండ‌గానే మెడ‌లో తాళి తెంపేసి జుట్టు ప‌ట్టుకున్నాడు. చైత్ర కేక‌లు వేయ‌డంతో స్థానికులు వ‌చ్చి తండ్రిని అడ్డుకున్నారు. తండ్రి నుంచి బ‌ల‌వంతంగా విడిపించుకున్న చైత్ర త‌న భ‌ర్త మ‌హేంద్ర‌ను చేరుకుంది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన అనంత‌రం ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి త‌మ‌ను ర‌క్షించాల‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. క‌న్న తండ్రే ఇంత క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని ఊహించ‌ని ఆ అమ్మాయి తండ్రి చేసిన ప‌నికి విస్తు పోయింది. ఈ ఘ‌ట‌న అక్క‌డ ఉన్న‌వారంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement