Sunday, November 24, 2024

యంగ్ ఏజ్ ప్రేమ .. 65ఏళ్ళకి ద‌క్కింది .. ఏంటా క‌థ ..

ప్రేమ ఏ వ‌య‌స్సులో పుడుతుంది.. ఎవ‌రం చెప్ప‌గ‌లం .. యంగ్ ఏజే కాదండోయ్ .. ప్రేమ‌కి వ‌య‌సుతో సంబంధం లేద‌ని నిరూపించారు ఓ వృద్ధ జంట‌. అత‌డికి 65, ఆమెకి 65.. ఈ వ‌య‌సులో వారి ప్రేమ‌ను ద‌క్కించుకున్నారు. ఈ సంఘ‌ట‌న కర్ణాటకలోని మాండ్య జిల్లా మేలుకోటెలో జరిగింది. మైసూరులోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ మేలుకోటె చెలువనారాయణస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నారు. లేటు వయసులో ఘాటు ప్రేమను పండించుకున్న ఈ దంపతుల ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

వివ‌రాలు చూస్తే ..యంగ్ ఏజ్ లో ఉన్న‌ప్పుడు తాను ప్రేమించిన అమ్మాయికి అనుకోని పరిస్థితుల్లో వేరొకరితో వివాహమైంది. అతడు మాత్రం ఆమె జ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ బతికేశాడు. ప్రస్తుతం అతడి వయసు 65 సంవత్సరాలు. మరోవైపు, పెద్దల బలవంతంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా.. ఆమె కొంతకాలానికి భర్తను కోల్పోయింది. పిల్లలు కలగలేదు. దీంతో ఒంటరిగానే జీవితాన్ని గడిపింది. అయినప్పటికీ వారిలో ప్రేమ అలాగే మిగిలి ఉంది. ఇద్దరూ తాము ప్రేమించుకున్న నాటి మధురానుభూతులను నెమరువేసుకుంటూ గడిపేశారు. చివరికి ఈ వయసులో ఒక్కటై తమ ప్రేమను నిలబెట్టుకోవాలని భావించారు. అనుకున్నదే తడవుగా సమాజ కట్టుబాట్లను చీల్చుకుని 65 ఏళ్ల వయసులో శాస్త్రోక్తంగా పెళ్లాడి ఒక్కటయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement