Thursday, November 21, 2024

ప్రేమ‌లో ఫెయిల్.. ఒత్తిడి త‌ట్టుకోలేక శృంగారం.. విల్ స్మిత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు ..

చాలామంది మ‌హిళ‌ల‌తో స‌న్నిహితంగా మెలిగాన‌ని తెలిపాడు హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్. దానికి కార‌ణం కూడా చెప్పాడు. 16వ ఏట మెలానియా అనే యువ‌తితో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని.. ఓ కన్సర్ట్ లో భాగంగా ఇద్దరం కొన్నాళ్లు దూరంగా ఉన్నామని, ఆ సమయంలో ఆమె వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని వెల్ల‌డించాడు. అది తనను చాలా బాధించిందని, వెంటనే బ్రేకప్ చెప్పి విడిపోయామని చెప్పాడు.ఆ బాధను దిగమింగుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక విపరీతంగా శృంగారంలో పాల్గొనేవాడినని వివ‌రించాడు. అయితే తనకు ఇష్టం లేకుండా శృంగారం చేసేవాడినని, కొన్ని సార్లు వాంతులు కూడా అయ్యేవని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

ప్రస్తుతం విల్ స్మిత్ సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తండ్రి, టెన్నిస్ కోచ్ రిచర్డ్ విలియమ్స్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘కింగ్ రిచర్డ్’ అనే బయోపిక్ లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు.1992లో అతడు షిరీ జాంపియానోను పెళ్లాడాడు. వారికి ఓ కుమారుడు పుట్టాడు. 1995లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 1997లోఓ జాడా పింకెట్ స్మిత్ అనే నటిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. వారి పేర్లు జాడెన్ క్రిస్టఫర్ సైర్ స్మిత్, విల్లో కెమిలీ రౌన్ స్మిత్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement