వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): లేటు వయస్సులో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక పోతున్నారు. ఓకరి కోసం మరొకరు తపించి పోతున్నారు. విరహ వేదనను భరించలేక వయోభేధాలు మరచి, సభ్య సమాజానికి దూరంగా వెళ్లారు. భగ్న ప్రేమికుడి భార్య సద్గుణ ఫిర్యాదుతో ఆ ఇద్దరి ప్రేమ బాగోతం వెలుగులోకి వచ్చింది. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆయనకు ముగ్గురు సంతానం. ఆమెకూ పెళ్లైన నాటి నుండి భర్తతోనే కాదు, పేరెంట్స్ తోను గొడవలే. దాంతో వారి దాంపత్య జీవితం ఒడిదుడుకలతో సాగింది. ఆమెకు పిల్లలు లేరు. ఇక.. వారిద్దరూ ఒకే ఆఫీసులో కలసి పనిచేశారు. ఆయన డీఈ కాగా, ఆమె ఏఈఈ. ఇద్దరికి పెళ్లిళ్లు అయినా వారి మధ్య రిలేషన్ కుదిరింది. ఇంతకీ ఆయన వయస్సు ఎంత అనే డౌటనుమానం వస్తుంది కదా.. ఆయనకు 62, ఆమెకు 34. వీరిద్దరి మధ్య సగానికి సగం వయస్సు తేడా ఉంది. అయినా మనసు పలికే మౌనరాగానికి వయసుతో ఏం సంబంధం అనుకున్నారో ఏమో.. వారిద్దరి మధ్య వయస్సు ప్రతిబంధకం కాలేదు.
ఆమె తనపై ఆఫీసర్ మోజులో పడి, పేరెంట్స్ కుదిర్చిన వ్యక్తితో కలసి ఉండలేక తెగదెంపులు చేసుకొంది. పేరెంట్స్ తో కూడ కలసి ఉండకుండా ఉద్యోగం చేస్తున్న చోటే ఒంటరిగా ఉంటోంది. ఇక వారిద్దరి మధ్య అడ్డు చెప్పే వారు లేకుండా పోయారు. అయ్య గారు జాబ్ పేరుతో హన్మకొండ నుండి మహబూబాబాద్ కు వెళ్లి, జాబ్ బిజీ పేరుతో అక్కడే మకాం వేసేవాడు. భర్త బాగోతం అప్పట్లో ఆ సతీమణి తెలుసుకోలేక పోయింది. కొన్నాళ్ల పాటు ఎంజాయ్ చేసిన ఆ భగ్న ప్రేమికుల రహాస్యం గానే కొనసాగింది. సదరు డీఈ రిటైర్డ్ అయ్యాడు. ఇక రెగ్యులర్ గా కలుసుకోవడంలో కష్టాలు మొదలయ్యాయి. రిటైర్ అయిన తర్వాత ఆ విచిత్ర జంట అడపాదడపా మహబూబాబాద్ వీడి విహార యాత్రలు వెళ్లి వచ్చారు. అదే అలవాటు ప్రకారం
ఈనెల 14న, మిషన్ భగీరథలో డీఈగా పనిచేసి రిటైర్మెంట్ అయిన కందుకూరి సంజీవ్ కనిపించకుండా పోయాడు.
ఈ విషయంపై సంజీవ్ భార్య సద్గుణ సుబేధారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మొబైల్ ఫోన్ ట్రెస్ చేశారు. శ్రీశైలంలో ఉన్నట్టు గుర్తించారు. సుబేధారి సీఐ శూకూర్ కేర్ తీసుకొని, పోలీస్ బృందాన్ని శ్రీశైలానికి పంపించారు.
శ్రీశైలం వెళ్లిన పోలీస్ బృందానికి కారులో రిటైర్డ్ డీఈ సంజీవ్, ఏఈఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని సుబేధారి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. మిస్సింగ్ కేసును ఛేజించిన్నట్లు సీఐ తెలిపారు.
కాగా, మిషన్ భగీరథ ఏఈఈ గార్ల బయ్యారం నుండి బైక్ పై మహబూబాబాద్ బస్టాండ్ లో పార్క్ చేసి, వెళ్లిపోయినట్టు పోలీసుల విచారణలో తేలింది. హన్మకొండ నుండి సంజీవ్ బొలెరో వెహికిల్ లో శ్రీశైలానికి వెళ్లాడు. ఇద్దరు మధ్యలో కలుసుకొని, శ్రీశైలం వెళ్లి అయిదు రోజుల పాటు గడిపారు. సంజీవ్ కు తనకు అటాచ్ మెంట్ ఉందని ఏఈఈ చెబుతుండటం, ఆమె పేరెంట్స్ కూడ ఫిర్యాదు చేయకపోవడంతో ఈ భగ్న ప్రేమికుల కథ పోలీస్ స్టేషన్ నుండి బయటకొచ్చింది.
కాగా, సంజీవ్ కు ముగ్గురు సంతానం ఉండగా, ఆమె కు పిల్లలెవ్వరు లేరు. వారిద్హరి మధ్య ఉన్న బంధం గురించి పోలీసులు నోరు మెదపడం లేదు. కుటుంబ సభ్యులు సైతం పరువు పోతుందని గుట్టుగా సెటిల్ చేసుకొనే పనిలో పడట్టు తెలుస్తోంది. ఈ జంట ప్రేమాయణం ఎటు మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ బాగోతంపై ఆమె పేరెంట్స్ మౌనం వహిస్తుండటాన్ని బట్టి మరేటువంటి ట్విస్టులు వెలుగు చూస్తాయోనని ఉత్కంఠ నెలకొంది.